మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:56 IST)

పేకాడుతూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ సినీ న‌టుడు కృష్ణుడు!

టాలీవుడ్ నటుడు, వైసీపి నేత కృష్ణుడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. గ‌తంలో వైసీపి అధినేత జ‌గ‌న్ పాద యాత్ర చేసిన‌పుడు, ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా కృష్ణుడు కూడా పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. అనంత‌రం త‌ను వైసీపీలో చేరుతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. 
 
న‌టుడు కృష్ణుడు హైదరాబాద్, మియాపూర్ లోని శిల్పా పార్క్ లో గల ఓ విల్లాలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో స్పెష‌ల్ టీమ్ పోలీసులు దాడి చేశారు. పేకాట శిబిరం నిర్వాహకుడు పెద్దిరాజుతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొన్నారు. వారితోపాటు న‌టుడు కృష్ణుడిని కూడా పోలీసులు  మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.