Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆయన జేసీ దివాకర్ రెడ్డి.. విమానం ఎక్కనీయొద్దు :: వెనుదిరిగిన టీడీపీ ఎంపీ!

ఆదివారం, 9 జులై 2017 (10:18 IST)

Widgets Magazine
jc diwakar reddy

అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొలి దెబ్బ తగిలింది. వైజాగ్ విమానాశ్రయంలో చేసిన హడావుడి పర్యావసనాన్ని ఆయన ఎదుర్కొన్నారు. జేసీని విమానం ఎక్కనీయకుండా విమాన సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో చేసేదేం లేక వెనుదిరిగారు. ఆదివారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. 
 
ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆదివారం ఉదయం 6:40 గంటలకు విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆయన టికెట్ బుక్ చేసుకోగా, "మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేము" అని ట్రూ జెట్ సిబ్బంది స్పష్టం చేశారు.
 
దీంతో చేసేదేమీ లేక జేసీ వెనుదిరిగారు. ఇటీవల విశాఖపట్నంలో ఆయన విమానాశ్రయ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఘటన జరిగిన రోజు విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో విమానం ఎక్కినా, ఆ తర్వాత జేసీ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కలేకపోవడం ఇదే తొలిసారి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెండున్నరేళ్ళలో 465 మందిని చంపేసిన పాకిస్థాన్ సర్కారు

గడచిన రెండున్నరేళ్ళలో 465 మందిని పాకిస్థాన్ సర్కారు ఉరితీసి చంపేసింది. అయితే, వీరింతా ...

news

కర్నూలులో టీడీపీ షాక్.. : వైకాపాలో చేరనున్న శిల్పా చక్రపాణి రెడ్డి?

కర్నూలు జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే ఆ ...

news

ఇక ఓపిక లేదు.. ఉ.కొరియాను పీస్.. పీస్ చేసేస్తాం: జిన్ పింగ్‌తో డోనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ...

news

ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ వరం.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్ర ప్రజలకు ఓ వరం ప్రకటించారు. ప్రభుత్వ ...

Widgets Magazine