ఏ ముఖం పెట్టుకుని వచ్చినవ్.. ఏం చేశావనీ నీక ఓటేయాలి.. తెరాస మాజీకి షాక్...
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచారంలో స్థానికులు చుక్కలు చూపుతున్నారు. నాలుగేళ్ళ తర్వాత గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతుండటంతో నాయకులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచారంలో స్థానికులు చుక్కలు చూపుతున్నారు. నాలుగేళ్ళ తర్వాత గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతుండటంతో నాయకులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
"మా గ్రామానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర వేర్చలేదు. మళ్లీ ఓట్లు అడగనీకి ఏ ముఖం పెట్టుకుని వచ్చినవ్? అసలు ఏం చేశావని నీకు ఓటేయాలి" అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామస్తులు టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని నిలదీశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి శనివారం దోతిగూడెంలో పర్యటించారు. 'పిలాయిపల్లి కాలువ లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని గ్రామానికి వచ్చిన ప్రతిసారి చెబుతున్నారు.. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ నీరు రాలేదు' అని పైళ్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామంలో సీసీ రోడ్లు లేవని, డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైందని, తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని వాపోయారు. ప్రజలు పైళ్ల ను ప్రశ్నిస్తున్న క్రమంలోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 1