Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ. 149కే ప్రతి ఇంటికి టీవీ, నెట్, ఫోన్... మంత్రి పల్లె ప్రకటన

సోమవారం, 5 మార్చి 2018 (21:58 IST)

Widgets Magazine

అమరావతి: ఈ నెల 5వ తేదీ సోమవారం ప్రారంభమైన ఏపీ శాసనసభ సమావేశాలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. సమావేశాలకు మధ్యలో 5 రోజులు సెలవులని చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై జరిగే చర్చకు 7వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తారన్నారు. 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. సమావేశాలు జరిగే కాలంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. 
chandrababu-Governer
 
గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించినట్లు తెలిపారు. 84 లక్షల మంది రైతులకు రూ.24 వేల కోట్ల రుణాలు మాఫి చేసినట్లు వివరించారు. ఈ విధంగా రద్దు చేయడం దేశంలోనే ఓ అపూర్వ ఘట్టం అన్నారు. దీంతో రైతుల తలరాతలు మారిపోయాయన్నారు. ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నదులు అనుసంధానం అని, పట్టిసీమ ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశారని చెప్పారు. 
 
ప్రభుత్వం చేపట్టిన పనుల ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఈ-ఆఫీస్, ఈ-ఫైల్స్ వంటి వాటి ద్వారా సాంకేతిక రంగంలో రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని చెప్పారు. వ్యాపార అనుకూలతలతో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. రూ.13.54 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా పారిశ్రామిక రంగం పురోభివృద్ధి సాధించనుందన్నారు. ఫైబర్ నెట్ ద్వారా రూ.149 లకే ప్రతి ఇంటికి టీవీ, నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. 
chandrababu-Governer
 
రాష్ట్రంలో కోటి 42 లక్షల కుటుంబాలకు రేషన్ అందజేస్తున్నట్లు చెప్పారు. 50 లక్షల మందికి పెన్షన్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నుంచి 24X7 విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 12 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించడానికి ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు వివరించారు. సంక్షేమ పథకాల్లో చంద్రన్న బీమా ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సామర్థ్యం వల్ల అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఎన్నికల హామీలన్నిటిని నెరవేర్చినట్లు పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేవుళ్ళకు కులాలను ఆపాదిస్తారా.. మీరు మనుషులేనా? పరిపూర్ణానంద(వీడియో)

మఠాధిపతులు, పీఠాధిపతుల్లో శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి రూటే సపరేటు. ఎప్పుడూ ఏదో ...

news

19 అంశాలు కేంద్రం పరిష్కరించాలి... డొక్కా మాణిక్యవరప్రసాద్

అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని వాటితోపాటు హామీ ఇచ్చిన 19 అంశాలను కేంద్రం పరిష్కరించాలని ...

news

దేశం రెండు ముక్కలవుతుంది : శ్రీశ్రీ రవిశంకర్

భారతదేశం రెండు ముక్కలు అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ...

news

చిత్రహింసలు భరించలేక.. తాగుబోతు భర్తకు విషమిచ్చి...

ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తాగుబోతు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ ఇల్లాలు ...

Widgets Magazine