శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 16 నవంబరు 2018 (12:14 IST)

జగన్‌ను పొడిచింది కోడి కత్తితో కాదు.... నిందితుడు షాకింగ్ వ్యాఖ్య

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన ఘటన తెలిసిందే. ఐతే ఈ దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్ షాకింగ్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తను జగన్ మోహన్ రెడ్డిపైన కోడి కత్తితో దాడి చేయలేదనీ, అదసలు ఎలా వచ్చిందో తనకు తెలియదనీ, ఐతే పదునైన ఆయుధంతో మాత్రం చేశానని చెప్పుకొచ్చాడట. ఈ విషయాన్ని శ్రీనివాస్ తరపు న్యాయవాది చెప్పారు. 
 
విశాఖపట్టణంలోని కేంద్ర కారాగారంలో వున్న నిందితుడు శ్రీనివాస్‌తో అతడి తల్లి సోదరుడు ములాఖత్ అయిన సందర్భంగా అతడు ఈ విషయాలను వెల్లడించినట్లు చెపుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిపైన పదునైన ఆయుధంతో దాడి చేసిన మాట వాస్తవమే కానీ... దాని స్థానంలో కోడి కత్తి ఎలా వచ్చిందో తనకు తెలియడంలేదని చెప్పాడని న్యాయవాది వెల్లడించారు. 
 
కాగా వచ్చే ఎన్నికల్లో ఏపీ మొత్తం అసెంబ్లీ స్థానాల్లో జగన్ మోహన్ రెడ్డి 160 స్థానాలను గెలుచుకుంటుందనీ, జగన్ ముఖ్యమంత్రి అవుతారంటూ అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది.