గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (11:33 IST)

విశాఖపట్టణంలో డ్రగ్స్ కలకలం - ఇద్దరి అరెస్టు

సాగరతీరం విశాఖపట్టణంలో మరోమారు డ్రగ్స్ కలకలం చెలరేగింది. విశాఖ నగరంలోని ఎన్.ఏ.డి జక్షన్‌ వద్ద టాస్క్ ఫోర్సో పోలీసులు, ఎయిర్‌పోర్టు జోన్ పోలీసుల కలిసి సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక యువతి ఉండటం గమనార్హం. 
 
యువతిది హైదరాబాద్ నగరంలో కాగా, యువకుడు విశాఖపట్టణం, మర్రిపాలెన గ్రీన్ గార్డెన్ వాసిగా గుర్తించారు. వీరివద్ద నుంచి డ్రగ్స్‌ను టాబ్లెట్ల నుంచి 18 పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరివద్ద మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అయితే, ఈ యువతీ యువకులు ఇద్దరూ ప్రేమికులు కావడం గమనార్హం. విశాఖలో డ్రగ్స్‌కు అలవాటుపడిన ఈ ప్రేమజంట హైదరాబాద్ నుంచి ఈ మత్తుపదార్థాలను తెచ్చుకున్నట్టు సమాచారం.