గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:44 IST)

ఫంక్షన్‌కు వెళ్లిన పాపం.. సాంబారులో పడి పాప మృతి

sambar
పుట్టిన రోజు ఫంక్షన్‌కు వెళ్లిన పాపం.. ఆ పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సాంబారులో పడి రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా విసన్నపేట దళితవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...  బంధువుల ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్‌కు పాపను తీసుకెళ్లారు తల్లిదండ్రులు. 
 
ఫంక్షన్ జరుగుతుండగా ఉన్నట్టుండి కుర్చీలో నుంచి వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో పడిపోయింది చిన్నారి. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పాప ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.