Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉద్దాన ప్రజల కిడ్నీ సమస్యకు తాగునీరు కారణం కాదు

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:33 IST)

Widgets Magazine
kidney

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంత ప్రజల కిడ్నీ సమస్యలకు తాగునీరు ప్రధాన కారణం కాదని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా దక్షిణ భారత విభాగం ప్రాంతీయ కార్యాలయం (హైదరాబాద్‌) అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎం. శ్రీధర్‌ అంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తాగునీటి కారణంగానే ఉద్దానంలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయని వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తమ విభాగం జరిపిన పరిశోధనలో అక్కడి నీటిలో ఎలాంటి ఘనపదార్థాలు ప్రమాదకర స్థాయిని తెలిపే గణంకాలు నమోదుకాలేదని వివరించారు. 
 
అయితే, కిడ్నీ రోగులకు తాగునీరు అధికంగా అవసరం కాబట్టి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావొద్దని తెలిపారు. అదేసమయంలో ఈ సమస్యకు గల కారణాలను కనుగొనేందుకు తమ బృందం అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు తాము జరిపిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను ఓ నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. 
 
కాగా, ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వినతి మేరకు.. హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రత్యేక వైద్యబృందం ఉద్దానంలో పర్యటించి అధ్యయనం చేసిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఢిల్లీలోనూ అవమానమే... ఇక నూకలు చెల్లినట్టే...

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ...

news

మా దేశ లోక్‌సభ సీట్ల సంఖ్య 546 : యుఎస్ విద్యార్థులతో రాహుల్

భారతదేశ ప్రధానమంత్రి పదవికి సిద్ధమని ప్రకటించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...

news

విడాకులు కోరుతున్నారా? ఆర్నెల్లు ఆగక్కర్లేదు : సుప్రీంకోర్టు

భార్యాభర్తలు ఒకరిఒకరు వేరుపడాలని (విడాకులు) నిర్ణయించుకున్నప్పుడు వారికి ప్రత్యేకంగా కొంత ...

news

రైలులో సీటివ్వలేదనీ ఆ మహిళ ఏం చేసిందో చూడండి.. (Video)

బస్సుల్లో అయితే మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. అలాగే, సిటీ రైళ్లలో మహిళలకంటూ ...

Widgets Magazine