బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (14:50 IST)

పుకార్లు నమ్మొద్దు.. వైకాపాలో చేరడం లేదు : ఉండవల్లి

తాను వైకాపాలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపాలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై ఉండవల్లి అరుణ్ క్లారిటీ ఇచ్చారు. తాను వైకాపాలో చేరుతున్నని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. 
 
పైగా, రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పినట్టు వెల్లడించారు. ఇకపై తిరిగి రాజకీయల్లోకి వచ్చే ఆలోచన ఏదీ లేదన్నారు. ముఖ్యంగా తనకి ఇలాగే బాగుందని తప్పులు చేసిన అధికార, ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నిచడం వల్ల ఎంతో సంతృప్తి చెందుతున్నాన్నారు. వైసీపీ పార్టీలో తనకంటే అనుభవజ్ఞులైన, మేధావులు ఉన్నారని పార్టీకి తన అవసరం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు.