పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్
కేంద్రం నూతన విద్యావిధానం (ఎన్ఈపీ) తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కేంద్రానికి కొన్ని సూచనలు అందించారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ జనసేనాని పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. విద్యార్థులు ప్రారంభ దశలో మాతృభాష లోనే బోధన చేయడం భారతదేశ బావితరాలకు గొప్ప శక్తినిచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. తనకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రికి పవన్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్ఈపీ రూపకల్పనలో మీ బృందం చేసిన కృషి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులు మంచి భవిష్యత్తును రూపుదిద్దుకుంటారని, ఉన్నత విద్యను అందరికి అందించడమే ఈ విద్యావిధానం యొక్క ప్రధాన లక్ష్యమని పవన్ తెలిపారు.