శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (20:41 IST)

ఎవరైనా ముష్టి వేస్తానంటే.. ప్రతి రోజూ నేనూ ముష్టి అడుగుతా... వెంకయ్య నాయుడు

ప్రతి రోజూ వందల కోట్ల రూపాయలు ముష్టి వేస్తానంటే.. నేను కూడా ప్రతి రోజూ ముష్టి అడుగుతానని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఓ న్యూస్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా

ప్రతి రోజూ వందల కోట్ల రూపాయలు ముష్టి వేస్తానంటే.. నేను కూడా ప్రతి రోజూ ముష్టి అడుగుతానని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఓ న్యూస్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ఇచ్చారని గతంలో కొందరు వ్యాఖ్యలు చేశారని, వాళ్లు ఎన్నివేల రూ.కోట్లు కొట్టేసిన వాళ్లయితే ఈ మాట అంటారంటూ మండిపడ్డారు. 
 
'ముష్టిగా ఎవరైనా వందకోట్లు వేసేటట్లయితే.. నేను రోజూపోయి ముష్టి అడుగుతాను. ఆ డబ్బంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖర్చు పెడతాను. ఈ విధంగా చేయడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. వంద కోట్ల రూపాయలను ముష్టితో పోలుస్తున్నారంటే.. వాళ్లు ఎన్ని వందల కోట్లను కొట్టేసిన వాళ్లు.. దోచుకున్న వాళ్లు? ఇటువంటి మాటలన్నీ దుర్మార్గమైనవి. పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి వరం. కేంద్ర తొలి కేబినెట్ సమావేశంలోనే ‘పోలవరం’ ముంపు మండలాలపై నిర్ణయం తీసుకున్నాం. 7 ముంపు మండలాలను ఏపీలో కలిపాం. ‘పోలవరం’కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించింది మేమే’ అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే... రాష్ట్రాన్ని విడదీస్తున్న విషయాన్ని స్వయంగా సోనియా గాంధీ నాడు తనకు స్వయంగా చెప్పారన్నారు. 'రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ ఆ మాట నాకు చెప్పారు. సమైక్యాంధ్రా కాదు, ఏపీకి ఏం కావాలో అడగాలని చాలామంది నాయకులకు నేను చెప్పాను. విభజన బిల్లు సరిగ్గా రూపొందించి ఉంటే ఇబ్బందులు తలెత్తేవి కావన్నారు.