మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : గురువారం, 18 మే 2017 (15:20 IST)

వాల్మీకి, బోయల అభివృద్ధికి కృషి : బీటీ నాయుడు

వాల్మీకి, బోయ కులస్తుల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ వాల్మీకి, బోయ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ అధ్యక్షుడు బీటీ నాయుడు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో బుధవారం న

వాల్మీకి, బోయ కులస్తుల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏపీ వాల్మీకి, బోయ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ అధ్యక్షుడు బీటీ నాయుడు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తనను చైర్మన్‌గా అయిదుగురు సభ్యులతో కూడిన పాలకమండలిని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. 
 
ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 10 జారీ చేసిందన్నారు. ఈ పాలకమండలిలో సాకే మద్దిలేటి, బి.బాదన్నా, బి.వెంకటనారాయణ, సి.హులిగయ్యా, కె.సుశీలమ్మను సభ్యులుగా నియమించారన్నారు. పాలకమండలి కాలపరిమితి రెండేళ్లని తెలిపారు. ఫెడరేషన్ కు రూ.25 కోట్ల నిధులు కేటాయించారన్నారు.
 
గత 70 ఏళ్ల నుంచి ఎందరో ముఖ్యమంత్రులకు విన్నవించినా ఎవరూ వాల్మీకి, బోయ ఫెడరేషన్ ఏర్పాటుకు ముందురాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు ఏపీ వాల్మీకి, బోయ కో ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ అధ్యక్షుడు బీటీ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన వాల్మీకి, బోయ ఫెడరేషన్ కు తనను ఛైర్మన్‌గా ఎంపిక చేయడంపై నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. 
 
తనపై నమ్మకం ఉంచిన సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రి లోకేష్‌కు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, ఎంపి టీజీ వెంకటేష్‌కు, తమ జిల్లాకు చెందిన మంత్రి అఖిల్ ప్రియకు ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి కులవృత్తులూ లేకపోవడం వల్ల వాల్మీకి, బోయ కులస్తులు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ప్రభుత్వ పథకాలను సైతం వినియోగించుకోలేకపోతున్నారని చెప్పారు. 
 
వాల్మీకి, బోయలను ఉత్తరాంధ్రలో ఎస్టీలుగా, రాయలసీమలో బీసీలుగా గుర్తిస్తున్నారన్నారు. ఇటువంటి ప్రాంతీయ భేదం తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సత్యపాల్ కమిటీని వేసిందన్నారు. వాల్మీకి, బోయలను రాష్ట్రమంతటా ఒకే కులంగా గుర్తించడంపై ఆ కమిటీ నివేదిక సిద్ధం చేసిందన్నారు. గాంధీ జయంతి నాటికి వాల్మీకి, బోయలకు ప్రభుత్వం తీపి కబురు అందించే వీలుందన్నారు. ఈ సమావేశంలో వాల్మీకి, బోయ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు.