గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (07:06 IST)

జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకం అంత్యదశ: వర్ల రామయ్య

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిపాలనలో అరాచకం అంత్యదశకు చేరినట్లుగా ఉందని, తానుముఖ్యమంత్రి అయ్యిందే అరాచకం, అవినీతి చేయడానికి అన్నట్లుగా ఆయనవ్యవహరిస్తుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరనేతుల ఆయనదారిలోనే నడుస్తున్నారని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. 
 
వైసీపీవారు అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పాలనావ్యవస్థ చేతిలో చట్టాలు పెట్టడమనేది ఎంతవరకు సబబో సమాధానం చెప్పాలి. చిత్తూరుజిల్లాలో జరిగిన దాడి ఏమిటి? చనిపోయిన టీడీపీనేతలు, కార్యకర్తల కుటుంబాలవారిని టీడీపీనేతలు పరామర్శించడానికి వెళ్లకూడదా? 

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నేత్రత్వంలో టీడీపీనేతలు, కార్యకర్తలు వెళుతుంటే వారిపై రాళ్లు,కర్రలతో దాడిచేయిస్తారా? 200మందికి పైచిలుకు వైసీపీకార్యకర్తలు, రాళ్లు, కర్రలతో టీడీపీవారి వాహనాలపై దాడిచేస్తారా? దాడిచేస్తూ ఎమ్మెల్యే చూసుకుంటాడు అంటూ వేసేయండి అని కేకలు వేస్తారా? వేసేసే కల్చర్ ఏమిటండీ...? 

అరాచకరాజ్యంలో ఉన్నామా... ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నామో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. టీడీపీకార్యకర్తలు బయటకు రాకూడదా? వస్తే తలలుపగులగొట్టి దాడిచేస్తారా? చిత్తూరులో జరిగింది మరో మాచర్ల దాడి. మాచర్ల దాడి జరిగి నప్పుడే, శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఉంటే, నేడు చిత్తూరులో దాడి జరిగేది కాదు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ ని  ఎన్నిసార్లు అడిగినా ఆయన నోరెత్తడు. ఇప్పుడేం మాట్లాడతారో  మాట్లాడాలి. మాచర్ల ఘటనకు, నేడు జరిగిన దాడికి ఏమైనా తేడా ఉందా? ఆనాడు డీజీపీ చట్టాన్ని సక్రమంగా అమలుచేసి, చట్టబద్ధంగా వ్యవహరించి ఉంటే, నేడు చిత్తూరులో దాడిజరిగేదా? ఇది ముమ్మాటికీ డీజీపీ వైఫల్యం వల్ల జరిగిన దాడే. 

పోలీస్ వ్యవస్థ  వెనకడుగు వేసిందో లేదో డీజీపీ సమాధానం చెప్పాలి.  టీడీపీ ప్రభుత్వం కూడా ఇదేమాదిరి వ్యవహరించిఉంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒక్క అడుగైనా వేసేవాడా? కానీ చంద్రబాబానాయుడు నడిపింది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి, జగన్ పాదయాత్ర ప్రశాంతంగా సాగింది. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి?

ఇది  ధర్మమా..న్యాయమా... చట్టబద్ధమా... సమంజసమా అని నేనుప్రశ్నిస్తున్నా.  పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లతో పనిలేదని అక్కడి, టీడీపీ నాయకులు,  ప్రజలంటున్నారు. పోలీస్ స్టేషన్లు తీసేసి, వైసీపీవారికి అప్పగిస్తే వారేనడుపుకుంటారు. ఆ రెండు  నియోజ కవర్గాల్లో చట్టం అనేది సజావుగా సాగుతుందని డీజీపీగానీ, మరో సీనియర్ అధికారిగానీ సమాధానం చెప్పగలరా?

తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలతో ఆంధ్రప్రధేశ్ పోలీసుల కు సంబంధం లేదని డీజీపీ చెప్పగలరా? మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి చెప్పిందే చట్టమా? మాచర్ల ఘటన జరిగిననాడే డీజీపీ చట్టప్రకారం పనిచేసుంటే, నేడు చిత్తూరులో టీడీపీవారిపై దాడిజరిగేది కాదు. పోలీస్ వ్యవస్థ  అసమర్థతవల్లే నేడు దాడిజరిగింది. పోలీస్ వ్యవస్థ ఎందుకు కిమ్మనకుండా దాడులను చూస్తూ ఉంటోంది. చర్యలు తీసుకోకుండా, దాడిజరిగినతర్వాత లెక్కలు రాసుకుంటారా? 

టీడీపీవారు వస్తున్నారని తెలిసినప్పుడు, అసలు వైసీపీ కార్యకర్తల ను ఎందుకు అనుమతించారు? దాడిచేసిన   వైసీపీకార్యకర్తలను తరిమేయకుండా, దాడికి గురైన టీడీపీనేతలు, కార్యకర్తలను వాహ నాల్లో తరలించడమేంటి? వైసీపీ కార్యకర్త అంటే వారికి చట్టం వర్తించదా? వారు చట్టానికి అతీతులా? నిన్న ఛైర్ పర్సన్ నంటూ వైసీపీ మహిళానేత టోల్ గేట్ సిబ్బందిపై దాడిచేసింది.

మహిళానేత దాడిచేసినవైనంపై పోలీస్ వ్యవస్థ స్పందిచంలేదు. చూడబోతే సవాంగ్ ఆమెచేసింది కరెక్ట్ అనేలా ఉన్నారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. పోలీస్ వ్యవస్థ శాంతిభద్రతల అమల్లో వెనకడుగు వేస్తూ, మీనమేషాలు లెక్కిస్తోంది. టీడీపీవారిపై దాడి జరుగుతుంటే, పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో పోలీస్ వ్యవస్థ నిస్తేజమైపోయింది.

పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా వ్యవహరించడం లేదు. పోలీసులు వారి విధినిర్వహణను సక్రమంగా నిర్వర్తించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్పమరోమార్గంలేదు. చిత్తూరులో జరిగినఘటనకు సంబంధించి తాము  రిట్ ఆఫ్ మేండమస్ వేయాలా అని డీజీపీని అడుగుతున్నాను. ఈ విషయంలో మేం కోర్టులనుఆశ్రయిస్తే ఎంతటి హస్యాస్పదంగా ఉంటుందో డీజీపీ ఆలోచించాలి. ఆయన ఇప్పటికే పలుమార్లు కోర్టుకు వెళ్లొచ్చారు.

పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పోలీస్ వ్యవస్థ పనితీరుపై తాము హైకోర్టుని ఆశ్రయించాలా? జరిగిన ఘటనలో దాడిచేసినవారందరినీ గుర్తించి, వారిపై కేసులు నమోదుచేయకుండా, టీడీపీవారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ తారా?  చిత్తూరులో జరిగిన దాడి మరో మాచర్ల ఘటనే. టీడీపీ నేతలు కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు, కార్యకర్తలపై దాడిచేయడం  ముమ్మాటికీ ప్రభుత్వ అసమర్థతే.

ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా కాపాడాలని, చట్టం అమల్లో తన-పర బేథాలు లేకుండా వ్యవహరించాలని ముఖ్యమంత్రిని, డీజీపీ సవాంగ్ ని కోరుతున్నాను. టీడీపీనేతలేమీ దాడిచేయడానికి వెళ్లలేదని, వారు పరామర్శించడానికే వెళ్లారని, రెడ్డిగారి ఇలాఖాలోకి వెళ్లాలంటే వీసాకి ఏమైనా దరఖాస్తు చేయా లా?  ఈ విధంగా జరిగే దాడుల్లో ముఖ్యమంత్రి అసమర్థత, సవాంగ్ వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్ లో చరిత్రగా  నిలిచిపోతుంది.