శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 మార్చి 2022 (17:00 IST)

వేదాంత వీజీసీబీ తాగునీటి ప్రాజెక్ట్‌ ద్వారా 2 వేల విశాఖ కుటుంబాలకు లబ్ధి

వేదాంత వీజీసీబీ ఇటీవలనే తాగునీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీనిద్వారా విశాఖపట్నంలో 2వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా, వేదాంత యొక్క వీజీసీబీ 4వేల ఎల్‌పీహెచ్‌ సామర్ధ్యం కలిగిన ఆర్‌ఓ ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. ఇది దగ్గరలోని కమ్యూనిటీలకు సురక్షిత, స్వచ్ఛమైన తాగునీటిని నామమాత్రపు ఫీజుతో అందిస్తుంది. గతంలో ఈ ప్రాజెక్ట్‌ను గౌరవనీయ విశాఖపట్నం నగర మేయర్‌ శ్రీమతి గొలగాని హరివెంకట కుమారి; 39వ వార్డ్‌ కార్పోరేటర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ సాదిక్‌; 29వవార్డు కార్పోరేటర్‌ శ్రీ వురుకూటి నారాయణ రావు; వీజీసీబీ డిప్యూటీ సీఈవో శ్రీ సీ సతీష్‌ కుమార్‌ తదితరులు ప్రారంభించారు.

 
విజయవంతంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడంతో పాటుగా కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత నిర్వహణ కోసం ఓల్డ్‌ టౌన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ, విశాఖపట్నంకు అందజేశారు. ఈ ప్రాజెక్ట్‌ను స్వీయ సమృద్ధి నమూనాలో నిర్వహిస్తున్నారు. ఈ ప్లాంట్‌ నిర్వహణ కోసం నామమాత్రపు ఫీజులను నీటి సరఫరా కోసం కమ్యూనిటీ నుంచి సేకరిస్తారు. వీజీసీబీ ప్రయత్నాలను గౌరవనీయ మేయర్‌ ప్రశంసించడంతో పాటుగా కోవిడ్‌ ఉపశమన కార్యక్రమాలకు మద్దతునందించారు.

 
వేదాంత లిమిటెడ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ సెక్టార్‌ సీఈఓ సౌవిక్‌ మజుందార్‌ మాట్లాడుతూ, ‘‘నిర్మాణాత్మక సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీల సమగ్ర అభివృద్ధికి మేము తోడ్పడుతున్నాం.  మా సీఎస్‌ఆర్‌ కార్యక్రమాలలో ఆరోగ్యం అతి ప్రధానంగా దృష్టికేంద్రీకరించిన అంశమైతే, తాగునీటి ప్రాజెక్ట్‌ ఆ దిశగా వేసిన ఓ ముందడుగు’’ అని అన్నారు

 
ఓల్డ్‌ టౌన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ మరియు గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పోరేషన్‌ 39వ వార్డ్‌ కార్పోరేటర్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ సాదిక్‌ తాను రాసిన లేఖలో మానవతా ధృక్పథంతో చేపట్టిన వేదాంత కార్యకలాపాలను ప్రశంసించారు.

 
వేదాంత లిమిటెడ్‌, డిప్యూటీ సీఈవో-వీజీసీబీ సి సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ, తమ వ్యాపార సిద్ధాంతంలో అతికీలకమైన అంశంగా సమాజ అభివృద్ధి ఉంటుందన్నారు. ఓల్డ్‌ టౌన్‌ ఏరియాలో  ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుచేయడం ఉపయుక్తంగా ఉందని, ఈ ప్లాంట్‌ ప్రారంభంతో అతి తక్కువ ధరతో సురక్షిత తాగునీరు పొందే అవకాశం తమకు లభించిందని ఈ ప్రాజెక్ట్‌ లబ్ధిదారులలో ఒకరైన ఇస్మాయిల్‌ మొహమ్మద్‌ అన్నారు.