సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (16:54 IST)

సింహాచ‌లంలో జగన్మోహన్ రెడ్డి పేరుతో విజ‌య‌సాయి ప్రత్యేక పూజలు

విశాఖప‌ట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఆల‌య ఇ.వో. సూర్యకళ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ విజ‌య‌సాయికి ఘన స్వాగతం పలికారు. అనంత‌రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
శ్రావ‌ణ శుక్ర‌వారం సంద‌ర్భంగా దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను విజయసాయిరెడ్డి, ఇ.వో. సూర్యకళ  ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్రార్ధించామ‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు.