గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (15:14 IST)

బీజేపీ చుట్టూ తిరుగుతున్న ప్యాకేజీ స్టార్ : విజయసాయి రెడ్డి

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. యజమాని ఆదేశిస్తే బీజేపీ చుట్టూ తిరుగుతున్న ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు వేశారు. వీరిలో యజమాని ఎవరో కాదు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగా పేర్కొనగా, పవన్‌ను మరోమారు ప్యాకేజీ స్టార్‌తో పోల్చారు.
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. యజమాని ఆజ్ఞాపిస్తేనే ప్యాకేజీ స్టార్ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీని తన కనుసన్నల్లో నడిపించే ప్రయత్నాల్లో భాగంగానే ముందుగా పావలాను చంద్రబాబు పంపించాడని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలానికి పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా తన సైకిల్ పార్టీకి మేలు జరిగేలా చూసుకోవాలనేది బాబు ఎత్తుగడ అని విజయసాయి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.