శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (14:52 IST)

మా మొగుళ్లను అరెస్టు చేస్తారా? ఏం చేశామనీ... లం...కం చేశామా? : జగన్‌ను నిలదీసి ఏఎన్ఎం

తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఏఎన్ఎం (యాక్సిలరీ నర్స్ మిడ్‌వైఫ్ - గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్)లు వైకాపా అధినేత, జగన్ మోహన్ రెడ్డిని ఏకిపారేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం, వేతనాలను చెల్లించాలని కోరుతూ విజయవాడ వేదిగగా ఏఎన్ఎంలు ధర్నా చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా వీరు విజయవాడలోనే ఆందోళన చేస్తున్నారు. వీరిని కలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ రాకపోవడంతో వీరు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా, ఓ మహిళా ఏఎన్ఎం మీడియాతో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
విజయవాడలో ధర్నా చేయడానికి ఏఎన్ఎంలంతా కలిసి వచ్చారు. దీంతో ఆయా గ్రామాల్లో ఉన్న వీరి భర్తలను స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ చర్యపై వారు మండిపడుతున్నారు. మేమేం తప్పు చేశాం. దొంగతనం చేశామా, లం.. యిరకం చేశామా, మా భర్తలను ఎందుకు అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. 
 
ఓ ఏఎన్ఎం, తన భర్తతో పాటు ఎంతో మంది మొగుళ్లను జైళ్లలో పెట్టారని, ధర్నాను విరమించి తాము వెనక్కు వెళితేనే వారిని వదిలేస్తామని అంటున్నారని మండిపడింది. వేల కిలోమీటర్లు పాదయాత్ర తిరిగిన జగన్, పక్కనే ఉన్న విజయవాడకు వచ్చి తమతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. తాము ఎంతో మందికి చెప్పి జగన్‌కు ఓటేయించామని, ఇప్పుడు ఆయన వచ్చి తమ సమస్యలు తీర్చాల్సిందేనని డిమాండ్ చేసింది. 
 
ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన చంద్రబాబు, 'వైసీపీ ప్రభుత్వ దుర్మార్గానికిది పరాకాష్ట. తమ సమస్య చెప్పుకోడానికని వచ్చిన ఎఎన్ఎంలను ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. గత్యంతరంలేక ఆందోళనకు దిగిన మహిళలను బెదిరించడానికి వారి భర్తలను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారా? న్యాయం చేయడం చేతకాక మహిళల పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తారా?' అంటూ నిలదీశారు. ఆ మహిళ మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.