శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 21 జనవరి 2022 (18:50 IST)

సయ్యద్ అస్లంది సహజ మరణం కానే కాదు...

విజ‌య‌వాడ‌లోని పంజా సెంట‌ర్లో మృతి చెందిన అస్లం ది సహజ మరణం కానే కాద‌ని అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు ఆరోపిస్తున్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నాయకులు మీడియాతో మాట్లాడారు. 
 
 
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతాఉల్లాహ్ మాట్లాడుతూ,  సయ్యద్ అస్లంకు ఇద్దరు భార్యల‌ని, మొదటి భార్య ఇంట్లో అస్లం చనిపోయినప్పుడు అతని ఒంటిపై గాయాలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు చూసారు కానీ, ఎవరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేద‌న్నారు. రెండవ భార్యను దగ్గరకు రానివ్వలేద‌ని, రెండు రోజుల తర్వాత మృతునిపై గాయాలు ఉన్నాయని ఫోటోల్లో చూసి రెండో భార్య కేసు పెట్టింద‌ని చెప్పారు. పోలీస్ లు కేసు నమోదు చేయటంలో జాప్యం చేసార‌ని, అలాగే, పోస్ట్ మార్టం చేసే చోట డాక్టర్స్ రావటం కూడా చాలా జాప్యం జరిగింద‌న్నారు.
 
 
పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులు, లేదా నగర నాయకులు జోక్యం చేసుకొని తారు మారు చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు ఉన్నాయ‌న్నారు. ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేద‌న్నారు. ఫొటోలో ఉన్న గాయాలను చూస్తుంటే, అది సహజ  మరణం కాదు బలవన్మరణంగానే పక్కాగా కనిపిస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక అధికార పార్టీ నాయకుల వత్తిడి తో తేడా చేస్తే ఢిల్లీ వరకైనా వెళ్లే సత్తా మాకుందని తెలియజేసారు. అస్లాం ఇంటి దగ్గర సీసీ కెమెరాలు, అలాగే అస్లం మరణించిన రాత్రి అతని ఇంటికి ఎవరు వచ్చారు. మరియు అనుమానితుల నడక మీద, వాళ్ళు ఎవరు ఎవరు ఫోన్ లో మాట్లాడారు, వాళ్లకు ఎన్ని ఫోన్ నెంబర్ లు ఉన్నాయి ఇవన్నీ పరిగణ లోకి తీసుకొని ఇంక్విరి చేయాల్సిన బాధ్యత పోలీస్ ల పై ఉందని అన్నారు.
 
 
నగర పోలీస్ కమీషనర్ ఈ కేసులో ప్రత్తేక దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఎం.ఐ.ఎం. నగర అధ్యక్షులు సమీర్ మాట్లాడుతూ అస్లం హంతకులు ఎవరైనా క్షమించేది లేదు అస్లం మొదటి భార్య తో అన్వార్ అనే వ్యక్తి కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయని ఇదే అన్వార్ ఫోటోలు జగన్ తో డీజీపీ తో కూడా ఉన్నాయని అసలు ఈ అన్వార్ ఎవరు ఇతని అస్లాం మొదటి భార్యకు సంబంధం ఏమిటో పూర్తి విచారణ జరపాలని అన్నారు.
 
 
54వ డివిజన్ కార్పొరేటర్ అర్షద్ మాట్లాడుతూ అస్లాం మరణం వెనకాల ఎవరున్నా క్షమించేది లేదని, అస్లాం మరణం సహజ మరణమా లేక బలవన్మరణమో పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తేలిపోతుందని అన్నారు. సమావేశంలో సయ్యద్ సలీం, హబీబ్ భాయ్, జహీద్, వాజీద్, జబ్బార్, ఖాదర్,నజీర్, నజీబ్, తదితరులు పాల్గొన్నారు.