విజయవాడ యువతి హత్య కేసు మరో మలుపు, వాళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేస్కున్నారా?
విజయవాడ యువతి హత్య కేసు మరో మలుపు తిరిగింది. మృతురాలు దివ్య, స్వామి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. కొన్నిరోజుల కిందట వారిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు... స్వామి సోదరుడు చెబుతున్నాడు. వీరిద్దరి పెళ్లి యువతి కుటుంబానికి ఇష్టం లేదు.
పెళ్లి విషయం తెలిసిన తర్వాత దివ్యను గృహనిర్బంధం చేసినట్లు సమాచారం. నిన్న స్వామితో దివ్య తండ్రి గొడపడినట్లు చెప్తున్నారు. అయితే దివ్య, చిన్నస్వామి ఇద్దరు ప్రేమించుకున్నారన్నది క్లారిటీ లేదని పోలీసులు చెబుతున్నారు.
దివ్య మెడ, పొట్టమీద కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు చీరకట్టి ఉందని, అది ఎవరు, ఎందుకు కట్టారో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.