గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (16:44 IST)

విజ‌య‌వాడ‌లో యు.జి.డి పనులకు శంకుస్థాపన చేసిన మేయ‌ర్

విజ‌య‌వాడ నగరాభివృద్ధియే లక్ష్యంగా డివిజన్ సమస్యల పరిష్కారం కోసం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప‌లు శంకుస్తాప‌న‌లు చేశారు. సర్కిల్-3 పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజ్ పురం దాసరి రమణ నగర్ లో రూ.14 లక్షల అంచనాలతో  పలు అంతర్గత రోడ్ల భూగర్భ డ్రైనేజి పైపు లైన్ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయ‌ర్ బెల్లం దుర్గ‌,  తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ మెరకనపల్లి మాధురిలతో క‌లిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. 
 
                                                                                                                                                        ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మిమాట్లాడుతూ నగర అభివృద్ధి దృష్టిలో ఉంచికొని అనేక కోట్ల రూపాయలతో డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేయుట జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో 6 అంగుళాల పాత డ్రెయినేజి పైపులు ఉండ‌టం కారణంగా డ్రెయినేజి ఇబ్బందులు ఎదురౌతున్నందున‌ వాటిని తొలగిస్తున్నామ‌ని చెప్పారు. వాటి స్థానములో 200 యం.యం. పైపులు వేస్తామ‌ని, ఈ పనులు అన్నియు నెల రోజుల లోపుగా పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులు, కాంట్రాక్ట‌ర్ ని ఆదేశించారు. ఈ  కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, డిప్యూటీ ఇంజనీర్ టి.రంగారావు మరియు స్థానిక వై.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.