శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (11:15 IST)

వైకాపా నేతల ఒత్తిడి తట్టుకోలేనంటూ గ్రామ సచివాలయ ఉద్యోగిని సూసైడ్

అనంతపురం జిల్లాలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడిని తట్టుకోలేక గ్రామసచివాలయ ఉద్యోగిని చనిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని హిందూపురం పట్టణానికి చెందిన కాలప్ప, పద్మల ఏకైక కుమార్తె నందిని, గత యేడాది సెప్టెంబరు నెలలో సచివాలయ ఉద్యోగినిగా ఎంపికైంది. ఆమెకు కణేకల్లు 4వ సచివాలయం కార్యదర్శిగా ఉద్యోగం రాగా, తన సహచరులు లలిత, శాంతి, వరలక్ష్మితో కలిసి ఓ అద్దెగదిలో ఉంటూ ఉద్యోగానికి వెళ్లివచ్చేది. 
 
ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం బాగాలేకపోగా, 20 రోజులు సెలువు పెట్టి, అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆపై శ్రీకాళహస్తిలో ఉద్యోగులకు శిక్షణ ఇస్తుండటంతో, నాలుగు రోజుల క్రితం అక్కడికి వెళ్లి, తిరిగి కణేకల్లు చేరుకుంది. స్నేహితురాళ్లతో బాగానే ఉన్న ఆమె, నిన్న మిగతావాళ్లు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, ఆమె ఉరేసుకున్న గదిని తనిఖీ చేయగా, అక్కడ ఓ నోటుబుక్‌లో రాసిపెట్టిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి పెరగడం, ఆరోగ్యం సహకరించక పోవడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు పేర్కొంది.