శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:09 IST)

రెండేళ్ల అయింది.. ఏం చేశారు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు చేదు అనుభవం ఎదురైంది. ‘పరిషత్‌’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చిత్తూరు మండలం దిగువమాసాపల్లెలోని సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చీ రాగానే సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఆయన్ను అడ్డుకున్నారు. 
 
‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. ఇప్పటిదాకా మాకు ఏం చేశావు’ అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప... తాము గుర్తుకురామా అని ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ప్రతిఘటన ఎదురవడంతో ఆయన కంగుతిన్నారు. 
 
కాసేవు ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి మరో గ్రామంలో జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి వెళ్లిపోయారు.