గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (20:14 IST)

నవంబరు 4న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ‌వారి ఆలయంలో నవంబరు 4న దీపావళి ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా నవంబరు 4న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.  ఈ కారణంగా నవంబరు 3న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున  భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
 
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల‌ సందర్భంగా రక్తదాన శిబిరం
విజిలెన్స్ అవగాహన వారోత్సవాల‌ సందర్భంగా టిటిడిలో విధులు నిర్వహిస్తున్న నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది రక్తదానం చేశారు. తిరుప‌తి బ‌ర్డ్ ఆసుప్ర‌తి ప్రాంగ‌ణంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల వైద్యశాలలో గురువారం ఉదయం పలువురు ఏవిఎస్వో లు, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ల తో పాటు 81 మంది భ‌ద్ర‌తా సిబ్బంది రక్తదానం చేశారు.
 
రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా సివిఎస్వో మాట్లాడుతూ టిటిడి భ‌ద్ర‌తా సిబ్బంది ఎన్నో ఒత్తిడుల మధ్య బాధ్యతాయుతంగా విధులను  నిర్వహిస్తున్నారని అన్నారు.