గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (14:15 IST)

టీడీపీకి భారీ షాక్: జగన్ సమక్షంలో వైకాపాలోకి విశాఖ డెయిరీ సభ్యులు

అమరావతి: విశాఖలో టిడిపికి భారీ షాక్ తగిలింది. ఆ జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రోద్బలంతో టీడీపీ ముఖ్యనేత, విశాఖ డెయిరీ చైర్మన్ కుమారుడు, పాలకవర్గం సభ్యులు ఆడారి ఆనంద్, ఆడారి రమ తదితర నేతలు వైఎస్‌ఆర్సీపీ తీర్ధం తీసుకున్నారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పలువురు నేతలతో కలసి పార్టీలో చేరారు.
 
విశాఖ డెయిరీ సభ్యులంతా వైసీపీలో చేరడంతో జిల్లాలో వైసీపీ మరింత బలం పుంజుకుందని పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. విశాఖ డెయిరీ రైతులకు అండగా ఉండి, న్యాయం చేస్తానని సీఎం జగన్ భరోసా ఇవ్వడంతో వీరంతా వైసీపీలో చేరారని తెలిపారు. 
 
ఎంపీ విజయశాయిరెడ్డి మాట్లాడుతూ, మరింతమంది ముఖ్యనేతల చేరికలు మున్ముందు ఉంటాయన్నారు. అయితే ఎమ్మెల్యేలు చేరాలంటే మాత్రం వైసీపీ నియమాల ప్రకారం రాజీనామా చేసి రావాల్సి ఉంటుందన్నారు.