Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి వివాహితను వంటగదిలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం...

శుక్రవారం, 7 జులై 2017 (12:15 IST)

Widgets Magazine
rape victim

కొందరు కామాంధులు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఒక వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విశాఖ జిల్లా గాజువాక పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... గాజువాక బీసీ రోడ్డు భానోజీతోట ప్రాంతంలో నివాసముంటున్న ఓ వివాహిత (36) ఇంటికి ఈ నెల 3న నర్సీపట్నానికి చెందిన పురుషోత్తం, గాజువాక, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన వెంకటేష్‌, హర్షరాజుతోపాటు ఓ బాలుడు వచ్చారు. ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని తనిఖీ చేసేందుకు వచ్చామని చెప్పారు. 
 
ఇక్కడ అటువంటిది ఏమీ లేదని వివాహిత చెప్పినప్పటికీ నలుగురు వ్యక్తులు వినకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి... బీరువా తెరిచి అందులో ఉన్న రూ.650 తీసుకున్నారు. అనంతరం వివాహితను వంటగదిలోకి ఈడ్చుకెళ్లి పురుషోత్తం, వెంకటేష్‌లు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమె కుమారుడు కూడా ఉన్నాడు. కాగా, బాధితురాలు సిక్కింకు చెందిన మహిళగా గుర్తించారు. ఉపాధి కోసం ఇక్కడకు వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి నివశిస్తోంది. 
 
అంతేగాకుండా మళ్లీ రేపు వస్తాం నగదు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆ మరుసటి రోజు బాలుడు వివాహితకు ఫోన్‌ చేసి ‘మీ ఇంటి దగ్గర ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద ఉన్నాను. డబ్బులు పట్టుకుని రావాలి’ అంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనలకు గురైన వివాహిత గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితురాలు ఇచ్చిన సమాచారంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిపై గతంలో అనేక దొంగతనాల కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి గెలుపు ఖాయమట... లగడపాటి

లగడపాటి రాజగోపాల్. ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే ఒక సర్వే చేసి ఫలితాలను ముందే ...

news

కొత్త జంటలకు సీఎం యోగి నయా గిఫ్ట్.. తెరిచి చూస్తే షాక్... కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు...

కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న ...

news

శిరీష లోదుస్తులపై వీర్యపు మరకలు లేవు: ఫోరెన్సిక్ రిపోర్టు

బ్యూటీషియన్ శిరీష లోదుస్తులపై ఎలాంటి మరకలు లేవని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. ...

news

తెలంగాణాలో కేసీఆర్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న మహిళ ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఓ మహిళ ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల ...