శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:09 IST)

ఆత్మ‌హ‌త్య య‌త్నం చేసిన కెజిహెచ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని

రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను అర్ధంత‌రంగా తీసివేస్తుండ‌టంతో, వారు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ప‌ని చేస్తున్న‌వారిని ఒక్క‌సారిగా తొల‌గించ‌డంతో వారు ద‌య‌నీయ స్థితిలో ఉన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, న‌మోదు చేసుకున్న‌వారిని కూడా ఇలా అర్ధంత‌రంగా తీసివేయ‌డం అన‌ర్ధాల‌కు దారి తీస్తోంది. 
 
విశాఖ‌ప‌ట్నంలో ఇటీవలే కింగ్ జార్జి హాస్పిట‌ల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులు నిర్వ‌హించ‌నీయ‌కుండా ఒక్క‌సారిగా నిలిపి వేశారు అర్దాంతరంగా ఉద్యోగం నుండి తొలగివేశారు అనే బాధతో ఒక మ‌హిళా ఉద్యోగిని ఆత్మహత్యకు య‌త్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఆమెను ప్రస్తుతం అదే  కె.జి.హెచ్. లో భవానీ నగర్ వార్డులో చికిత్స పొందుతోంది. ఎఫ్.ఎన్. ఒ. వరలక్ష్మితోపాటు కె.జి.హెచ్.  యాజమాన్యం సుమారు 65 మందిని తొల‌గించింది.

వీరంతా కె.జి.హెచ్.లో 3 సంవత్సరాల‌కు పైగా విధులు నిర్వహించారు. గత సంవత్సరం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో నమోదు అయ్యారు. అయినా వారిని తొల‌గించ‌డంతో ఉద్యోగులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. త‌మ‌కు పరిష్కర మార్గం చూపాల‌ని  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు.