శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (15:04 IST)

రాజీవ్ గాంధీపై దాడి కూడా ప్రమాదమేనా? : కేంద్ర మంత్రి వీకే సింగ్

పుల్వామా ఉగ్రదాడి 'ఓ ప్రమాదం' అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వీకే సింగ్ మండిపడ్డారు.  ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణించడం కూడా ప్రమాదమేనా లేదా ఉగ్రవాద ఘటనా? వీకే సింగ్‌ ప్రశ్నించారు.  
 
బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ జరిపిన దాడుల్లో ఎంతమంది చనిపోయి ఉంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. బాలాకోట్‌ దాడిలో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒకే ప్రదేశంలో దాడి జరిగింది. మరెక్కడ కూడా జరగలేదు. పాకిస్థాన్‌లోని సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చేసినట్లు వీకే సింగ్‌ వివరించారు. 
 
మెరుపు దాడుల్లో 250 మందికి పైగా మరణించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యలపై కూడా వీకేసింగ్‌ స్పందించారు. దాడులు జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారన్న దానిపై మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. అదొక అంచనా మాత్రమే. ఖచ్చితంగా 250 మంది చనిపోయారని అమిత్‌ షా నిర్దారించలేదని.. అయితే, ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని మాత్రమే చెబుతున్నారని వీకే సింగ్‌ వివరించారు.