శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జగనన్న కోసం IPAC బృందాన్ని నడిపాను... దివ్వెల మాధురి (Video)

divvela madhuri
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు తన వంతుగా కృషి చేశానని, ఇందుకోసం 60 మందితో ఐప్యాక్ జట్టును కూడా కొనసాగించానని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో అడల్టెరీ రిలేషన్ కొనసాగిస్తున్న దివ్వెల మాధురి చెప్పారు. ఈ అంశంపై ఆమె మాట్లాడుతూ, దువ్వాడ శ్రీనివాస్‌తో పరిచయమైన తర్వాత తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గత రెండేళ్లుగా తాను వైకాపాలో పని చేస్తున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, వైకాపాలో చేరిన వెంటనే తనను అధ్యక్షురాలిగా పని చేశానని చెప్పారు. తనను పార్టీలో చేర్పించింది కూడా దువ్వాడ వాణియేనని ఆమె తెలిపారు. తాను ఎవరో తెలియదని దువ్వాడ వాణి చెప్పడం ఏమాత్రం సబబు కాదన్నారు. దువ్వాడ వాణినే తనను వైకాపాలో చేర్పించారని తెలిపారు. తన వద్ద ఉన్న మహిళా ఓటు బ్యాంకును చూసి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పైగా, జగన్ అన్న కోసం ఒక ఐప్యాక్ బృందాన్ని కూడా నడిపించానని తెలిపారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ పర్యవేక్షించేవారని చెప్పారు. 
 
రోడ్డు ప్రమాదం కాదు.. నేనే ఢీకొట్టా : దివ్వెల మాధురి 
 
తాను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంపై దివ్వెల మాధురి స్పందించారు. తాను ప్రయాణిస్తూ వచ్చిన కారు ప్రమాదానికి గురికాలేదన్నారు. అందువల్ల ఇది ప్రమాదం కాదని చెప్పారు. ఆత్మహత్య చేసుకునేందుకు లారీని ఢీకొట్టబోయి రోడ్డుపక్కన ఉన్న కారును ఢీకొట్టానని తెలిపారు. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన భార్య దువ్వాడ వాణి చేసిన, చేస్తున్న ఆరోపణలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఇలా చేశానని తెలిపారు. పైగా, తనకు వైద్యులు చికిత్స చేయవద్దని కోరారు. తనకు చనిపోవాలని ఉందన్నారు. అయితే, కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం దివ్వెల మాధురి పీకల వరకు మద్యం సేవించి కారు నడిపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఒకే ఇంట్లో ఉంటున్నాం.... శారీరకంగా కలిశాం : దువ్వాడ శ్రీనివాస్ 
 
భరత నాట్య శిక్షకురాలు దివ్వెల మాధురి తాను ఒకే ఇంట్లో ఉంటున్నామని, శారీరకంగా కూడా కలిశామని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. దీన్న అడల్టెరీ రిలేషన్ అంటారని ఆయన చెప్పారు. ఇలా ఉండకూడదని సుప్రీంకోర్టు కూడా ఎక్కడా.. ఎపుడూ చెప్పలేదన్నారు. అదేసమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి చేసుకోవాడాని పరిస్థితి ఏంటో ఇపుడు తనకు అర్థమవుతుందన్నారు. గతంలో ఆయనపై కామెంట్స్ చేసిన మాట నిజమేనని, ఇపుడు పరిస్థితి తన వద్దకు వస్తేగానీ బోధడపటం లేదన్నారు. అదేసమయంలో మాధురి తనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందన్నారు. అందుకు ఆమెతో శారీరకంగా కలిశానని, ఈ విషయంలో తాను అబద్ధం చెప్పడం లేదన్నారు.