బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:33 IST)

బ్లాక్ టికెట్ల దందాకు చెక్.. సినిమా టికెట్ల కోసం ప్రభుత్వ పోర్టల్

ఏపీలోని జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టికెట్ల బుకింగ్ పోర్టల్‌ను పర్య వేక్షించనుంది ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.
 
ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిశీలించిన అనంతరం.. టికెటింగ్ సిస్టమ్ విధానంపై విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని నియమించనుంది జగన్ ప్రభుత్వం. ఆ తర్వాత.. దీని పై ప్రకటన చేయనుంది. అయితే ఈ విధానం ద్వారా థియేటర్ యజమానులు.. ఎక్కువగా ధరలు పెంచుకునే అవకాశం ఉండదు. అలాగే బ్లాక్ టికెట్ల దందాను కూడా అరికట్టే ఛాన్స్ ఉంటుంది.