గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (10:29 IST)

కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా సంక్షేమం: మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

తెలుగుదేశం ప్ర‌భుత్వంలో అభివృద్దిని ప‌ట్టించుకోకుండా దుర్మా‌ర్గ‌పు పాల‌న సాగించార‌ని దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో 39వ డివిజను ప్రాంతాల‌లో మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ప్రచారం నిర్వ‌హించారు. మంచి వ్య‌క్తుల‌ను గెలిపించుకోవాల‌ని త‌ద్వారా అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. 

టిడిపి పాల‌న గ్రూపు రాజ‌కీయ‌ల‌కే ప‌రిమితం అయింద‌న్నారు. డివిజ‌న్‌లో ఉన్న‌  స‌మ‌స్య‌ల శశ్వాత ప‌రిష్కార దిశ‌గా జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో ప‌నిచేస్తుంద‌న్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జ‌రుగుత‌న్న ఏక‌గ్రీవల‌‌ను చూసి త‌ట్టుకోలేక‌  అక్క‌సుతో  చంద్ర‌బాబు, లోకేష్ లు  మ‌త్రిభ్ర‌మించిన్న‌ట్లు  ప్ర‌వ‌ర్తిస్తున్నారన్నారు.