ఏపీ ముఖ్యమంత్రి పీఠం ఆయనదే.. తేల్చిన ఇండియా టుడే సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజల చెంతే ఉంటున్నారు.
ఈనేపథ్యంలో ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఓ సర్వే నిర్వహించింది. ఏపీ ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టనున్నట్లు తేలింది. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్‌కే ప్రజామద్దతు ఎక్కువగా ఉందని ఈ సర్వే స్పష్టంచేసింది.
ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం ఎవరు? అని అడిగిన ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ జగన్‌కు ఓటేయగా, మరో 38 శాతం మంది సీఎం చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 5 శాతం మంది ఓటేశారు.
ఈ నెల 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 10,650 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేకు తుదిరూపు ఇచ్చారు. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం మంది చెప్పగా, బాగోలేదని 36 శాతం మంది స్పష్టంచేశారు.