భార్య అక్రమ సంబంధం.. ఇద్దరు పిల్లలు ఏం చేశారనీ... భార్యతో సహా...

family
జె| Last Modified ఆదివారం, 11 నవంబరు 2018 (08:48 IST)
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలను అతి దారుణంగా చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడో  వ్యక్తి. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మడిబాక పంచాయతీ రాజులకండ్రిగలో ఘటన జరిగింది. 
 
మదనపల్లెకు చెందిన శ్రీనివాసులరెడ్డి స్వస్థలం మదనపల్లె. బుజ్జమ్మను ప్రేమ వివాహం చేసుకుని పది సంవత్సరాల క్రితం ఏర్పేడులో కాపురం పెట్టాడు. ఆ తరువాత రాజుల కండ్రిగలో సొంతంగా ఒక స్థలాన్ని కొన్నాడు. శ్రీనివాసుల రెడ్డికి ఇద్దరు పిల్లలు. భార్య బుజ్జమ్మను స్థానికంగా ఉన్న డిక్సన్ కంపెనీలో ఉద్యోగంలో చేర్పించాడు. 
 
బుజ్జమ్మ కొందరితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్జించుకోలేకపోయాడు. భార్యను మందలించి ఉద్యోగం నుంచి మాన్పించాడు. ఆ తరువాత రాజులకండ్రిగలో కాపురం పెట్టాడు.
 
 అక్కడ కూడా భార్య వేరొకరితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించులేకపోయాడు. రాత్రి భార్య బుజ్జమ్మ, ఇద్దరు పిల్లలు భవ్య, నితిన్‌లకు వారికి తెలియకుండా అన్నంలో పురుగుల మందు కలిపాడు. తెల్లారేసరికి వారి చచ్చిపోతారనుకుంటే అది జరగలేదు. కొన ఊపిరితో వున్నారు. దాంతో వారిపై పెట్రోల్ పోసి తాను నిప్పంటుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.దీనిపై మరింత చదవండి :