శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:42 IST)

ట్విట్టర్ సీఈవోగా విజయవాడ అమ్మాయి పద్మశ్రీ వారియర్...? నేడే ప్రకటన

ప్రపంచ సాంకేతిక రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాలను అధిరోహించి తెలుగువాడి సత్తా ఏమిటో నిరూపిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల ఎంపికై సంచలనం సృష్టించగా మరో తెలుగమ్మాయి ఇలాంటి సంచలనాన్ని సృష్టించనుందనే సమాచారం వస్తోంది. సోషల్ మీడియాలో కీలకమైనది ట్విట్టర్ అని అందరికీ తెలిసిందే. ఇపుడా ఆ ట్విట్టర్‌కు సీఈవోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన పద్మశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
కాగా మొన్నటివరకూ ట్విట్టర్ సీఈవోగా కొనసాగిన డిక్కాస్టలో రాజీనామా చేశారు. దీనితో ఈ పదవిలో ఎవరిని నియమించాలన్న దానిపై సంస్థ ఆరుగురు పేర్లను పరిశీలించగా, ఈ లిస్టులో పద్మశ్రీ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పదవికి పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఐతే యాజమాన్యం పద్మశ్రీ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జన్మించిన పద్మశ్రీ విజయవాడలోని మాంటిసోరిస్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. ఆ తర్వాత స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పద్మశ్రీ గత 20 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడి పలు కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించారు. కాగా ట్విట్టర్ సీఈవో ఎవరన్నది ఇవాళ ప్రకటించనున్నారు.