Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మూడు పెళ్లిళ్లు... ఇద్దరితో 'ఆ' బంధం.. పోలీసులకే బెదిరింపులు.. ఆపై ఆత్మహత్యాయత్నం

సోమవారం, 19 జూన్ 2017 (08:49 IST)

Widgets Magazine
suicide

గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకంగా ముగ్గురిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకున్న భర్తల్లో ఒకరిని బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో తన బండారం బయటపడుతుందని భావించిన ఆ మహిళ... పోలీసులనే బెదిరించేందుకు ప్రయత్నించి, చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గుంటూరు జిల్లా పాతగుంటూరు మణి హోటల్‌ ప్రాంతంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పాతగుంటూరు మణి హోటల్‌ ప్రాంతంలో నివసించే దేవదాస్‌ దంపతుల కుమార్తె 27 ఏళ్ల మహిత. ఈమె 12 ఏళ్ల క్రితం శేఖర్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ కుమార్తె ఉంది. రెండేళ్ల అనంతరం అతడిని వదిలేసి పాత గుంటూరులోనే మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. రెండేళ్ల తర్వాత కొరిటెపాడుకు చెందిన శ్రీమన్నారాయణ అనే వివాహితుడిని మూడో పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల అనంతరం మరో ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది.
 
ఆ యువకులను కూడా ఆమెను యేడాది క్రితం వదిలించుకుంది. తిరిగి శ్రీమన్నారాయణ వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసింది. ఇవ్వకపోతే మనిద్దరం కలిసి ఉన్న ఫొటోలు అందరికి చూపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీంతో శ్రీమన్నారాయణ పాత గుంటూరు పోలీసులను ఆశ్రయించగా మహితను పిలిపించి మందలించి పంపినట్లు సమాచారం. దీంతో మీ అందరి అంతు చూస్తానని వెళ్లిన మహిత ఆదివారం అనంతవరప్పాడు రోడ్డులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వట్టిచెరుకూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అడవుల్లో మంటలు.. రోడ్లపై కార్లు.. 20 కి.మీ. పొడవునా కార్చిచ్చు.. మాడి మసైన ప్రయాణికులు

పచ్చని పైన్, యూకలిప్టస్‌ చెట్లతో సుందరంగా కనిపించిన వనాలు శ్మశానాలుగా దర్శనమిస్తే.. 20 ...

news

మద్యం మత్తులో జోగుతుంటే.. దెయ్యం పట్టిందని.. చేతులు కాల్చేశారు..

మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం ...

news

క్యూబాతో బ్రేకప్.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హైజాకర్లు, ఉగ్రవాదులను కాపాడింది..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. బరాక్ ఒబామా ...

news

ఫాదర్స్ డే.. పెద్దమనిషి విమానంలో మహిళను వేధించాడు.. బయటకు చెప్పుకోని రీతిలో ప్యాంటుకు?

ఫాదర్స్ డే రోజున తండ్రి వయసున్న ఓ పెద్దమనిషి పక్కసీట్లోని మహిళపై వేధింపులకు దిగిన ఘటన ...

Widgets Magazine