బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 11 మే 2021 (16:59 IST)

కరోనా పాజిటివ్ వచ్చిందని భయంతో మహిళ ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ఎగిటల కుమారి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కరోనా టెస్ట్ చేయించుకుంది. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆందోళన చెందిన ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్ళి ఇబ్రహీంపట్నం ఎన్టీటిపిఎస్ కూలింగ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
 
ఇబ్రహీంపట్నం పోలిస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.