గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (13:27 IST)

పిల్లిని కాపాడబోయి ప్రాణాలు విడిచింది..

cats
పిల్లిని కాపాడబోయి ఓ మహిళ ప్రాణాలు విడిచింది. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం కిష్టంపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కిష్టంపల్లెకు చెందిన లింగాల లసుమ అనే మహిళ ఇంట్లో పిల్లిని పెంచుకుంటోంది. అయితే సోమవారం తెల్లవారుజామున పిల్లి ఇంటికి సమీపంలోని బావిలో పడింది. 
 
తెల్లారాక చూస్తే బావి నుంచి పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె బొక్కెన సాయంతో పిల్లిని బయటకు తీసేందుకు ప్రయత్నింస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.