గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (15:01 IST)

ఏపీలో జగన్ అరాచక పాలన.. ఢిల్లీలో బొటన వేలును నరుక్కున్న మహిళ!

ys jagan
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పరిపాలనకు వ్యతిరేకంగా ఓ మహిళ ఢిల్లీలో నిరసన తెలిపింది. అది కూడా సాధారణంగా కాదు. తన బొటన వేలును నరుక్కుని మరీ జగన్ పాలనను ఖండించింది. ఏపీలో జగన్ సర్కారు అరాచక పాలన జరుగుతోందని ఆరోపించింది. 
 
దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ లను కలుసుకునే ప్రయత్నం చేసింది. అది కుదరకపోవడంతో జగన్ పాలనలో ఏపీలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో తన బొటన వేలును నరుక్కుని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఈమె ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. ఏపీలో మహిళలతో గంజాయి అమ్మించడం మొదలుకొని తప్పుడు పత్రాలతో ఆస్తులను, భూములను కాజేయడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని వాపోయారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు బెదిరింపులు తప్పట్లేదని ఆమె వాపోయారు.