భార్యతో సర్పంచ్‌తో అక్రమ సంబంధం.. భర్త న్యాయ పోరాటం
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... కొద్ది రోజులకే తనకు ఝులక్ ఇచ్చి.. గ్రామ సర్పంచ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని జీర్ణించుకోలేని ఆ భర్త న్యాయం కోసం పోరాటానికి దిగారు. తెలంగాణ రాష్ట్రంలోని కర
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... కొద్ది రోజులకే తనకు ఝులక్ ఇచ్చి.. గ్రామ సర్పంచ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని జీర్ణించుకోలేని ఆ భర్త న్యాయం కోసం పోరాటానికి దిగారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
చొప్పదిండి మండలం చాకుంటకు చెందిన శ్రీనివాసాచారి వ్యక్తి రుక్మాపూర్‌కు చెందిన లావణ్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పైగా, పెద్దలను ఎదిరించి మరీ 2015సలో కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా వారిద్దరూ కొద్ది రోజులకే దూరమయ్యారు.
భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల పంచాయితీ చివరకు గ్రామ సంర్పచ్ కర్రె శ్రీనివాస్ దృష్టికి వెళ్లింది. అక్కడ పంచాయతీ పేరుతో సమావేశాలు నిర్వహించే సమయంలో లావణ్యపై సర్పంచ్ మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసాచారి బోరున విలపిస్తున్నాడు.
ఆ తర్వాత సమస్య పరిష్కారం కోసం సర్పంచ్‌ను ఆశ్రయిస్తే, ఆయన తన భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడని శ్రీనివాసాచారి ఆవేదన వ్యక్తంచేశాడు. ఇదే విషయంపై నిలదీస్తే, సర్పంచ్‌తో పాటు ఆమె బావ తిరుపతి తనపై ఎస్సీ, ఎస్టీ, వరకట్నం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని బోరున విలపిస్తూ, తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు.