శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (10:44 IST)

బైక్ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు-దాతృత్వం చాటిన సబ్ ఇన్స్పెక్టర్లు

బైకు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో సబ్ ఇన్స్‌స్పెక్టర్లు దాతృత్వం చూపెట్టారు. కృష్ణాజిల్లా ఏ-కొండూరు మండలం రామచంద్రపురం వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో బాణవాతు రాజ్య అనే మహిళకు తీవ్రగాయాలు పాలైంది.

మహిళా మిత్రా శిక్షణ తరగతులు కార్యక్రమం ముగించుకుని అటుగా వస్తున్న గంపలగూడెం, ఏ- కొండూరు ఎస్సైలు ఉమామహేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి... గాయపడిన మహిళను గమనించి పోలీస్ జీప్‌లో మైలవరం ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. 

సమయానికి పోలీసుల స్పందించకపోతే సదరు మహిళకు ప్రాణం నిలిచేది కాదు. ఆపదలో ఉన్న మహిళను కాపాడిన పోలీస్ అధికారులను  ప్రజలు అభినందిస్తున్నారు.