ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఏప్రియల్ 2025 (19:25 IST)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

Woman
Woman
ప్రకాశం బ్యారేజ్‌లో ఓ మహిళ పై నుంచి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే సకాలంలో గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో డ్రోన్లు, వాటర్ బెలూన్లు వాడి ఆ మహిళ ప్రాణాలు కాపాడారు. వైజాగ్ ప్రకాశం బ్యారేజ్‌పై నుంచి దూకేసింది. 
 
వేగంగా బ్యారేజీ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. కృష్ణానదిలోకి దూకేసింది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు మహిళ కుటుంబీకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. 
 
సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడి రెస్క్యూ టీమ్స్ శభాష్ అనిపించుకున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లో ఎన్డీఆర్ఎఫ్ పోలీసుల సాహసానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.