బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (11:26 IST)

ప్రేమ పేరుతో ముద్దూముచ్చట తీర్చుకున్నాడు.. పెళ్లనగానే ముఖం చాటేశాడు.. ప్రియురాలి మౌనదీక్ష

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని కాటారం ప్రాంతంలో ఓ యువతి తన ప్రియుడి చేతిలో మోసపోయింది. ప్రేమ పేరుతో ఎనిమిదేళ్ళపాటు సర్వంవాడుకుని పిప్పిచేసిన ప్రియుడు.. పెళ్ళిమాటెత్తగానే ముఖం

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని కాటారం ప్రాంతంలో ఓ యువతి తన ప్రియుడి చేతిలో మోసపోయింది. ప్రేమ పేరుతో ఎనిమిదేళ్ళపాటు సర్వంవాడుకుని పిప్పిచేసిన ప్రియుడు.. పెళ్ళిమాటెత్తగానే ముఖం చాటేశాడు. దీంతో దిక్కుతోచని ఆ యువతి ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మండల కేంద్రానికి చెందిన బొమ్మ సంతోష్‌ అనే యువకుడు, మండలంలోని గూడూరుకు చెందిన సృజన అనే యువతిని 8 ఏళ్లుగా ప్రేమించాడు. ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ముద్దూముచ్చట్లు ముందుగానే తీర్చుకున్నాడు. ఇద్దరు కలిసి సన్నిహితంగా ఫోటోలు సైతం దిగారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంతోష్‌ను ఈ యేడాది పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగింది. 
 
దీంతో గత 5 నెలలుగా రేపు, మాపు అంటూ తప్పించుకుతిరుగుతూ వచ్చాడు. ఇటీవల పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా తాను సృజనను పెళ్లి చేసుకుంటానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. అయితే ఇప్పుడు తీరా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని ముఖం చాటేసి మోసం చేశాడంటూ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన దీక్షకు దిగింది. తనకు సంతోష్‌తో పెళ్లి జరిగే వరకు ఇక్కడే ఉంటానని ఆమె స్పష్టంచేసింది.