శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (12:15 IST)

ఏఎస్ఐ భవానీ ఆత్మహత్య : ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన చోటే బలవన్మరణం...

విజయనగరం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. అడిషినల్ ఎస్ఐగా ఉన్న కె.భవానీ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెకు తొలిసారి పోస్టింగ్ వచ్చిన చోటే బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన కె.భవానీ సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్.ఐగా పని చేస్తున్నారు. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీకి ఇంకా పెళ్లి కాలేదు. 
 
అయితే, వారం రోజుల క్రితం విజయనగరం జిల్లాలో పీటీసీ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లి వచ్చారు. విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారి ఫోన్‌ చేసి శిక్షణ పూర్తయిపోయినట్లు చెప్పిందని తెలిసింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. 
 
రాజోలు స్టేషన్‌లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో భవానీకి మొదటి పోస్టింగ్ వచ్చింది.. అక్కడే ఆమె ప్రాణాలు తీసుకున్నారు. ఎస్సై ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
 
మరోవైపు, భవానీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్‌ తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.