బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (11:48 IST)

మహిళా భక్తులు స్నానాలు చేస్తుంటే దొంగపని చేసిన యువకుడు ...

video
ఏపీలోని వైయస్ఆర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీరామాలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చిన మహిళా భక్తులు ఇక్కడ తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేస్తుండగా ఓ యువకుడు మొబైల్‌లో చిత్రీకరణకుయత్నించిన ఘటన గురువారం కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీరాముడి దర్శనం కోసం రెండు కుటుంబాలు ఇక్కడకు వచ్చాయి. ఉదయం 9.30 గంటలకు ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోని తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో వెంటిలేటరు నుంచి ఓ యువకుడు చేతిలో చరవాణితో లోపలకు తొంగిచూస్తుండగా వారు గమనించి గట్టిగా కేకలు వేశారు. దీంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
దీనిపై భద్రతా సిబ్బందికి మౌఖికంగా ఫిర్యాదు చేయడంతో వారు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా యువకుడి ఆచూకీ లభించలేదు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు కూడా కొన్నిరోజులుగా సక్రమంగా పనిచేయడం లేదు. ఈ విషయంపై డిప్యూటీ ఈవో నటేష్ బాబు స్పందిస్తూ, మహిళల స్నానపుగదులు, వస్త్రాలు మార్చుకునే గదుల వద్ద భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.