బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 8 మార్చి 2018 (20:26 IST)

ఆ రోజు ఆ పని చేశాడని, మహిళ దినోత్సవం నాడు చెప్పుతో కొట్టిన టీచర్

తమపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, తగిన బుద్ధి చెప్పడానికి చాలామంది అదను కోసం ఎదురుచూస్తుంటారు. ఓ ఉపాధ్యాయురాలు కూడా ఇలాగే చేసింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తనపై గతంలో చర్య తీసుకున్న తన పైఅధికారిని చెప్పుతో కొట్టి కసి తీర

తమపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, తగిన బుద్ధి చెప్పడానికి చాలామంది అదను కోసం ఎదురుచూస్తుంటారు. ఓ ఉపాధ్యాయురాలు కూడా ఇలాగే చేసింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తనపై గతంలో చర్య తీసుకున్న తన పైఅధికారిని చెప్పుతో కొట్టి కసి తీర్చుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాలోని లింగాపూర్‌ స్కూల్‌లో ఆరు నెలల క్రితం ఇద్దరు ఉపాధ్యాయురాళ్ల మధ్య గొడవ జరిగింది. దానిపై వారి పైఅధికారి ఎంఈఓ రామిరెడ్డి ఉమాదేవి అనే టీచర్‌ను సస్పెండ్‌ చేశారు. దాంతో ఆమె అతడిపై కోపాన్ని పెంచుకుంది. ఈ రోజు పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతుండగా సదరు టీచర్ నేరుగా అక్కడికి వచ్చి చెప్పుతో అతడిని కొట్టింది. ఈ హఠత్పరిణామానికి అంతా ఆశ్చర్యపోయారు.