శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (15:08 IST)

ప‌ర‌మ శివుని తేజ‌స్సు నుంచి అవ‌త‌రించిన సుబ్బారాయ షష్ఠి!

లోక సంరక్షణార్ధం పరమ శివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన రోజే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.తానేటి వనిత వివ‌రించారు. గురువారం సుబ్రహ్మణ్యషష్ఠి సందర్బంగా కొవ్వూరు సుబ్రహ్మణ్య స్వామిగుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈ. ఓ, పురోహితులు పూర్ణకుభంతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, లోకసంరక్షణార్ధం పరమశివుని తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారు అవతరించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అని అన్నారు.
 
 
సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి  లేదా స్కందషష్ఠి అని, సుబ్బారాయ షష్ఠి అని కూడా అంటార‌ని, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటామని అన్నారు. కొవ్వూరు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. భక్తులు అందరికీ దర్శనం సులభంగా అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామ‌ని, వల్లీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషా లతో ఉండాలని ఆమె ఆకాక్షించారు.
 
 
మంత్రి వెంట కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, మునిసిపల్ వైస్ ఛైర్పర్శన్ లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీ దేవి, స్థానిక నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆర్. భాస్కర రావు, తదితరులు హాజరయ్యారు.