శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (14:47 IST)

య‌న‌మ‌ల చెత్త మాజీ ఫైనాన్స్ మినిస్ట‌ర్: విజ‌య‌సాయిరెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'జగన్ గారు ప్రమాణం చేసే నాటికి ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలాయి. దొరికిన చోటల్లా మేమే అప్పులు తెచ్చాం.

ఇంకెక్కడా రూపాయి  అప్పు పుట్టదు అని పబ్లిగ్గానే చెప్పిన యనమలకు శ్వేత పత్రం కావాలట. ఆర్థిక నిర్వహణలో దేశంలోనే చెత్త మాజీ ఫైనాన్స్ మినిస్ట‌ర్ ఇలా డిమాండు చేయడం వింతగా లేదూ?' అని విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు
 
'కాలం చెల్లిన రాజ‌కీయ నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లంద‌రూ తిర‌స్క‌రించారు. కులగ‌జ్జి ఉన్న ఎల్లో మీడియా త‌ప్ప మిగ‌తా ఎవ్వ‌రూ ఈ స్వార్థ‌పూరిత‌, దురాశ‌, అవినీతిపరుడు, మోస‌గాడ‌యిన రాజ‌కీయ నాయ‌కుడికి ప్రాధాన్య‌త ఇవ్వ‌రు' అని విజ‌య సాయిరెడ్డి పేర్కొన్నారు.