గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (13:01 IST)

మీరెందుకు అంత బాధపడిపోతున్నారు.. మీ బావగారనా?: పురంధేశ్వరి

purandeswari
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ కౌంటరిచ్చింది. వైసీపీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తీవ్రంగా స్పందించింది. "మీరెందుకు అంత బాధపడిపోతున్నారు... మీ బావగారనా?" అంటూ కౌంటర్ ఇచ్చింది. 
 
ఇంతకీ మీరు రాష్ట్రాధ్యక్షురాలిగా వున్నది ఏపీ బీజేపీకా లేక తెలుగుదేశం పార్టీకా? వందల కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే.. దానిపై మీ స్పందన చూసిన వారెవరికైనా ఇలాంటి సందేహమే కలుగుతుంది. 
 
గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందుకే అరెస్ట్ చేశారు. మీకెందుకు బాధ.. అంటూ వైసీపీ ఘాటుగా విమర్శించింది.