ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (17:10 IST)

వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  చేతుల మీదుగా శనివారం ఉదయం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్‌ చేత రిబ్బన్‌ కట్‌ చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు.
 
ఈ కార్యక్రమంలో రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరు అయ్యారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి సీఎం జగన్‌  పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే  పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో  కార్యకర్తలు, అభిమానులు హాజరు అయ్యారు.