శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2016 (21:05 IST)

మళ్లీ సీఎం చంద్రబాబును కలిసిన వైకాపా ఎమ్మెల్యే జలీల్ ఖాన్... జారుకుంటారా ఏంటి..?

వైకాపా ఎమ్మెల్యే రోజా... ఏం చూసి తెదేపాలో చేరుతారంటూ మండిపడ్డారు. కానీ ఆ పార్టీకి చెందిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మళ్లీ శనివారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఐతే జలీల్ ఖాన్ తెదేపాలో చేరుతారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై వైకాపా అప్రమత్తమై స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ ఇవాళ కూడా జలీల్ ఖాన్ మరోసారి చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఐతే మొన్న జలీల్ ఖాన్ వివరణ ఇచ్చుకున్నారు. ఇవాళ కూడా రిజర్వేషన్ల కోసమే కలిశానంటున్నారు. మరి భవిష్యత్తులో ఎన్నిసార్లు చంద్రబాబుతో సమావేశమవుతారో...? ఈ వ్యవహారం వైకాపాలో గుబులు రేపడం ఖాయమేనని అనుకోవచ్చు.