Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం.. అవినీతిలో బాబే సీనియర్: ఏకిపారేసిన రోజా

బుధవారం, 7 జూన్ 2017 (13:33 IST)

Widgets Magazine
Roja

రాజకీయాల్లో తానే సీనియర్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు విసిరారు. అవినీతిలో సీఎం చంద్రబాబే సీనియర్ అని రోజా ఆరోపించారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తన సీనియారిటీతో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒరగబెట్టిందేమీ లేదని.. కానీ అవినీతిలో మాత్రం సీనియారిటీని బాగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. 
 
ఎన్నికల ప్రచారంలో 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ప్రస్తావించిన విషయం నిజమా? కాదా? అని రోజా ప్రశ్నించారు. అవాస్తవాలతో కూడిన అభివృద్ధి రేటును చూపిస్తూ కేంద్రాన్ని కూడా చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నారని రోజా అన్నారు. 
 
హైదరాబాదులో రోజా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు అసెంబ్లీలో రెండు సార్లు ఎందుకు తీర్మానం చేశారని ప్రశ్నించారు. హోదా వల్ల ఎలాంటి ప్రయోజ నాలున్నాయో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు వెళ్తే తెలుస్తుందని, ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన సుజనా చౌదరి, సిఎం రమేష్‌లను అడిగినా చెబుతారని ఎద్దేవా చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. పవన్‌తో పొత్తుకు జగన్ ప్లాన్.. మహాకూటమి ఏర్పాటవుతుందా?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని.. అందుకోసం అందుబాటులో ఉండే ఏ ...

news

ప్రేమిస్తే చావాల్సిందే... దుడ్డుకర్రతో కూతురు తలపై కొట్టి చంపిన తల్లి...

ప్రేమంటే ఎందుకో పెద్దలు ఓ పట్టాన అంగీకరించరు. చాలా ప్రేమ వ్యవహారాలు ట్రాజెడీలుగానే ...

news

జూలై 3న రజినీ రాజకీయ ప్రవేశం... అల్లుడు ధనుష్‌కి ఎందుకు అంత ఆత్రం?

దక్షిణాది రాష్ట్రాల సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైంది. ఇప్పటివరకు ...

news

బరితెగించిన పాక్.. చైనాకు గిల్గిత్ భూముల్ని అమ్మేస్తుంది.. చైనా తక్కువేం తినలేదు..

చైనాలోని పలు కంపెనీలకు, చైనా ఆర్మీకి భూములను తెగ అమ్మేస్తున్నారంటూ గిల్గిత్-బాల్టిస్థాన్ ...

Widgets Magazine